విజయనగరం జిల్లాకు జాతీయస్థాయిలో నాలుగు స్కోచ్ పురస్కారాలు వరించాయి. ఒక స్వర్ణంతో పాటు, 3 రజత పతకాలు దక్కాయి. నీటి సంరక్షణలో భాగంగా నిర్వహించిన చెరువు శుద్ధి కార్యక్రమానికి బంగారు పతకం లభించింది. కోవిడ్-19 కట్టడికి తీసుకున్న చర్యలకు, స్పందన భోజనం, గిరిజన గర్భిణుల వసతి గృహం అంశాలకు రజత పతకాలు లభించాయి. వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా శనివారం నిర్వహించిన 65వ స్కోచ్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో జిల్లాకు వీటిని ప్రకటించారు. వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలు వివరించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సమష్టి సహకారంతోనే సాధించగలిగామని ఆయన అన్నారు. పురస్కారాలు ఉత్సాహాన్ని పెంచాయని, మరింత స్ఫూర్తితో ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరు కేకు కట్ చేసి ..మిగతా సిబ్బందితో ఆనందం పంచుకున్నాడు.
విజయనగరం జిల్లాకు జాతీయస్థాయిలో నాలుగు స్కోచ్ పురస్కారాలు - 65th Scotch Awards
విజయనగరం జిల్లాకు జాతీయస్థాయిలో నాలుగు స్కోచ్ పురస్కారాలు వరించాయి. ఒక స్వర్ణంతో పాటు, మూడు రజత పతకాలు దక్కాయి. చెరువు శుద్ధి, కోవిడ్ కట్టడి, స్పందన భోజనం, గిరిజన గర్భిణుల వసతి గృహం వంటి కార్యక్రమాలకు ఈ గౌరవం దక్కింది.
విజయనగరం జిల్లాకు జాతీయస్థాయిలో నాలుగు స్కోచ్ పురస్కారాలు