విజయనగరం జిల్లా ద్వారకామయి అంధుల పాఠశాలకు... గుర్తింపు తీసుకువచ్చింది ఈ విద్యార్థులే. క్రీడలు, సంగీతం, నటన, నృత్యం ఇలా ఒకటేమిటీ అన్నింటా వారి ముద్ర వేస్తున్నారు. చదరంగం, పరుగుపందెం, షార్ట్ఫుట్ వంటి క్రీడల్లో రాష్ట్రస్థాయి అవార్డులు గెలిచారీ ప్రతిభావంతులు. క్రీడల్లోనే కాదు పోటీ పరీక్షల్లోనూ ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారు.
ఎందులోనూ మేము తక్కువ కాదు..! - vijayanagram dwarkamai school blind students talent news
ఆ పాఠశాలలో ముఖ్యమంత్రి జగన్ గొంతు వినిపిస్తుంటుంది. ప్రతిపక్ష నేత అమరావతిపై గొంతెత్తి మాట్లాడేదీ ఆ బడిలోనే. సినీ ప్రముఖుల పవర్ఫుల్ డైలాగ్లూ వినిబడుతూనే ఉంటాయి. వీళ్లెవరూ ఆ పాఠశాల సందర్శకులైతే కాదు. మరి వారి గొంతులు ఎలా వినిపిస్తాయని అనుకుంటున్నారా...? ఇదంతా ఓ అంధ విద్యార్థి అనుకరణ. ఇలాంటి ప్రతిభావంతులు అక్కడ 60 మంది ఉన్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో సాధారణ విద్యార్థులతో పోటీ పడి అవార్డులు సాధిస్తున్నారంటే వారి టాలెంట్ ఏంటో అర్థమవుతుంది.
![ఎందులోనూ మేము తక్కువ కాదు..! blind students talent](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5578680-1068-5578680-1578044849270.jpg)
ఎందులోనూ మేము తక్కువ కాదు
ఎందులోనూ మేము తక్కువ కాదు..!
విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా నిష్ణాతులతో శిక్షణ అందిస్తున్నారనీ, తమ ప్రయత్నం ఫలిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ప్రధానోపాధ్యాయుడు అప్పలనాయుడు తెలిపారు. అన్ని రంగాల్లో విజేతులుగా నిలవటం తమకు ఆనందంగా ఉందని విద్యార్థులు చెప్తున్నారు. విజయాలతో వైకల్యాన్ని మరిచిపోతున్నామని అంటున్నారు. ఎంత కష్టపడినా ఏదీ సాధించలేకపోతున్నామని కుమిలిపోయే నేటి యువతకు... వీరి విజయాలు స్ఫూర్తి కలిగించాలని కోరుకుందాం.
ఇదీ చదవండి: పాఠశాల లేకపోయినా.. విద్యార్థులకు డిజిటల్ విద్య