ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాణాలకు తెగిస్తేనే రేషన్‌ బియ్యం దొరికేది... ! - problems for ration rice

'రేషన్ బియ్యం కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొద్దున్నే కొండ దిగుతాం..పోని బియ్యం తీసుకుంటామా అదిలేదు..డిపో మేనేజర్ వచ్చేంత వరకు పడిగాపులు కాయం..ఇవ్వకపోవటంతో రాత్రి వరకూ చూసి వెనుదిరగటం..దీనికి కారణం ఒక్కటే రెండుర్లకి ఒక డిపో అధికారి ఉండటమే...మా ఊరికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి మా సమస్యను పరిష్కరించండి' అని వేడుకుంటున్నారు గిరిపుత్రులు.

రేషన్ బియ్యం కోసం గిరిజనుల పడిగాపులు

By

Published : Sep 10, 2019, 2:22 PM IST

రేషన్ బియ్యం కోసం గిరిజనుల పడిగాపులు

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న కురుకూటీ గ్రామంలో జీసీసీ డిపోలో రేషన్ కష్టాలు తప్పటం లేదు. సాలూరు మండలంలోని గిరి శిఖర గ్రామాలైన సంపంగి పాడు, రూడి, కాగురుడి, సొంపుగాము తదితర ప్రాంతాల నుంచి గురుపూడి గ్రామానికి వచ్చిన గిరి బిడ్డలంతా నెలకోసారి జీసీసీఈ డిపోల్లో ఇచ్చే సరకుల కోసం కొండ దిగుతారు. ఉదయం 8 గంటలకు బయలుదేరి కాలినడక కిందకు వచ్చే సరికి 11 గంటలవుతుంది. పోనీ వచ్చిన వెంటనే రేషన్ ఇస్తారా అంటే అది జరగని పని.. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న మేనేజర్ రామారావే వేటగాని వలసలతోపాటు కురుకుటి గ్రామానికి రేషన్ ఇచ్చే వ్యక్తి. దీంతో సుదూర గ్రామాల నుంచి గిరిజనలు గంటల తరబడి వేచి ఉంటున్నారు. పోనీ అప్పటికైనా వస్తారా అంటే తెలియని పరిస్థితి. చికటి పడేవరకు పడిగాపులు కాయటం... రారని తెలుసుకుని వెనుదిరగటం... ఇంటికి చేరుకునే సరికి రాత్రవటం ప్రస్తుత పరిస్థితి.. అసలే వర్షాకాలం..అందులోనూ కొండ ప్రాంతం..పాములు, పురుగులు, ఎలుగుబంట్లు ఉండే చోట తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి రేషన్ బియ్యం కోసం వస్తున్నా ఇచ్చేవారు లేకపోతే ఎలా అని వాపోతున్నారు. ఒక్కో డిపోకి ఒక్కో మేనేజర్‌ని వేయండి అంటూ వాపోతున్నారు. మేనేజర్ తప్పా అంటే అతనికి రెండు చోట్ల ఇవ్వటంతో అతను విధులు నిర్వహాణలో ఆలస్యమవుతున్నారు. అధికారులు వెంటనే స్పందిచాలని కోరుకుంటున్నారు.

రేషన్ బియ్యం కోసం గిరిజనుల పడిగాపులు

ABOUT THE AUTHOR

...view details