లాక్డౌన్ అనంతరం విజయనగరం జిల్లాలో బస్సులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో జిల్లా ఎస్పీ రాజకుమారి విజయనగరం ఆర్టీసి కాంప్లెక్స్‌లో ఉన్న వలసదారులకు, ప్రయాణికులకు రాత్రి 10 గంటల సమయంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అనంతరం వారికి భోజనాలను అందించారు.
విజయనగరం ఆర్టీసీ బస్టాండ్‌లో ఆహారం పంపిణీ - vijayanagram sp on corona
విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉన్న వలస కార్మికులకు, ప్రయాణికులకు భోజనం పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని సూచించారు.
![విజయనగరం ఆర్టీసీ బస్టాండ్‌లో ఆహారం పంపిణీ vijayanagaram sp rajakumari at bus stand](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7298521-949-7298521-1590127936246.jpg)
బస్టాండ్ లో ఎస్పీ ఆహారం పంపిణీ