శ్రీ పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవాల నేపథ్యంలో ఇవాళ, రేపు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మద్యం దుకాణాలను మూసి వేయించాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులను కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ మునిసిపాలిటీ పరిధిలో.. మద్యం దుకాణాలు బంద్ - విజయనగరం వార్తలు
శ్రీ పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవాల నేపథ్యంలో.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని.. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులను కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశించారు.
ఉత్సవాలు జరిగే రెండు రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉన్నవి, అలాగే.. నగరానికి సమీపంలో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయించాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోమ, మంగళవారాల్లో సంబంధిత అధికారులు తనిఖీలు చేయాలని, ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు.
ఇదీ చదవండి:పైడితల్లి అమ్మవారి సంబరం.. పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్‌గజపతిరాజు