ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MINISTER BOTHSA: మంత్రి బొత్సకు విజయనగరం జేసీ పాదాభివందనం - VIRAL VIDEO

ఆయనో ఉన్నతాధికారి.. అయితేనేం మంత్రి పట్ల తనకున్న అభిమానాన్ని బాహాటంగా చాటుకున్నారు. నూతన సంవత్సరం సందర్బంగా.. అధికారులందరితోపాటు శుభాకాంక్షలు తెలిపినా ఆ అధికారి.. మరో అడుగు ముందుకేసి అమాత్యుడికి పాదాభివందనం చేశారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

vijayanagaram-jc-kishore-kumar-touches-minister-bothsa-feets
మంత్రి బొత్సకు విజయనగరం జేసీ పాదాభివందనాలు

By

Published : Jan 1, 2022, 2:20 PM IST

విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి బొత్స సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, సంయుక్త కలెక్టర్ కిశోర్ కుమార్, మహేష్ కుమార్​లు కూడా మంత్రి ఇంటికి వెళ్లారు. మంత్రి బొత్సతో పాటు ఆయన భార్య ఝూన్సీకి శుభాకాంక్షలు తెలిపారు.

జేసీ కిషోర్ కుమార్ కూడా మంత్రి బొత్స దంపతులకు పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపి ఆయనకు పాదాభివందనం చేశారు. జేసీ తీరుతో అక్కడున్న వారంతా షాకయ్యారు.

ABOUT THE AUTHOR

...view details