దేశవ్యాప్తంగా పేరున్న శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇకపై వెబ్ సైట్లో అందుబాటులోకి రానుంది.ఈ నెల12నుంచి15వరకు జరగనున్న పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించిన వెబ్ సైట్ ను,ప్రచార కరపత్రాలు,ఆహ్వాన ప్లెక్సీలను జిల్లా ఇంఛార్జి కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆవిష్కరించారు.గతంలో వెబ్ సైట్ సంక్షిప్తంగా సమాచారం ఉండేదని,ప్రస్తుతం వెబ్ సైట్ ను అభివృద్ది చేశామని వెంకటరమణా రెడ్డి చెప్పారు.అమ్మవారిని దర్శించుకునేందుకు శీఘ్రదర్శన టికెట్ల విక్రయాలను ప్రారంభించామని ఆయన తెలిపారు. 15వ తేదీన శీఘ్రదర్శన టికెట్ల విలువ రూ.100, 15న రూ. 300గా ధరలు ఉన్నాయని పేర్కొన్నారు.
విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి - vijayanagaram paidithalli ammavari utsavalu
ఈ నెల 12 నుంచి 15 వరకు జరగనున్న విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు అధికార్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలిపే వెబ్ సైట్ ను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి ప్రారంభించారు.
విజయనగరం ఉత్సవాల వెబ్సైట్ను ప్రారంభించిన జిల్లా ఇంఛార్జి కలెక్టర్
Last Updated : Oct 11, 2019, 1:35 PM IST