విజయనగరం జిల్లా... పేదలకు ఉచిత రేషన్ పంపిణీలో ముందంజలో ఉంది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం పేదలకు ప్రకటించిన ఉచిత రేషన్ ఐదో విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా మే 29 నుంచి జూన్ 2 వరకూ అందజేశారు.
జిల్లాలో 7.10 లక్షల కార్డులపై ఉచిత రేషన్ సరఫరా చేయాల్సి ఉండగా... జూన్ 2వ తేదీ నాటికి 5.48 లక్షల కుటుంబాలకు రేషన్ పంపిణీ పూర్తిచేశామని కలెక్టర్ ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. 77 శాతం కార్డుదారులకు రేషన్ పంపిణీ పూర్తిచేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామని పేర్కొన్నారు.