ఇల్లు, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా జిల్లా అంతటా సంపూర్ణ పారిశుద్ధ్యంతో, పచ్చని చెట్లతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకోవాలనే ఉన్నత ఆశయంతో.. సుందరీకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ డా. ఎం హరిజవహర్‌లాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
స్వచ్ఛ సేవలో పాల్గొన్న విజయనగరం కలెక్టర్ - విజయనగరం జిల్లా కలెక్టర్ న్యూస్
ఇంజనీర్స్‌డే సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ డా. ఎం హరిజవహర్‌లాల్... స్వచ్ఛ సేవలో పాల్గొన్నారు. జిల్లా అంతటా సంపూర్ణ పారిశుద్ధ్యంతో సుందరీకరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
స్వచ్ఛ సేవలో పాల్గొన్న విజయనగరం కలెక్టర్
ఇంజనీర్సు డే సందర్భంగా సందర్భంగా గ్రామీణ నీటి సరఫరా కార్యాలయం ఆవరణలో ఇంజినీర్లు స్వచ్ఛ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ 3 గంటలపాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.