కరోనా నియంత్రణ సూచీలపై విజయనగం జిల్లా కలెక్టర్ డా. ఎం హరిజవహర్ లాల్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొవిడ్ నియంత్రణలో ప్రభుత్వం రూపొందించిన సూచీల్లో జిల్లా మెుదటి రెండు స్థానాల్లోనే కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. నెలాఖరులోగా ఈ దిశగా ఫలితాలు సాధించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నెలాఖరుకు జిల్లాలో పాజిటివ్ కేసులు పది శాతం మించకుండా ఉండాలన్నారు. కొవిడ్ నుంచి కోలుకునే వారి శాతం 80కు పెరగాలని సూచించారు. మరణాల రేటు 0.2కు తగ్గాలని స్పష్టం చేశారు. కొవిడ్ ఆసుపత్రులు, కరోనా కేర్ సెంటర్ల ద్వారా అందిస్తున్న సేవలపై 90 శాతం సంతృప్తి వ్యక్తమయ్యేలా.. ఆయా సేవల్లో మెరుగుదల రావాలన్నారు.
'సూచీల్లో విజయనగరం జిల్లా మెుదటి రెండు స్థానాల్లోనే ఉండాలి' - vvijyanagaram collector dr.harijavahar
కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం రూపొందించిన సూచికల్లో... విజయనగరం జిల్లా మెుదటి రెండు స్థానాల్లోనే ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎం హరిజవహర్ లాల్ స్పష్టం చేశారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ సమీక్ష
కరోనా టెస్టుల నిర్వహణ, ప్రైమరీ కాంటాక్ట్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పాజిటివ్ వచ్చి.. ఇళ్లల్లోనే చికిత్స పొందుతున్న వారిపట్ల ప్రత్యక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఇదీ చదవండి:రంగుల రొయ్య..... చిక్కెనయ్య