విజయనగరం జిల్లాకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యత్రాలను.. నెల్లిమర్లలో నిల్వ చేసిన గోదామును జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ పరిశీలించారు. గోదాముకు వేసిన సీలును పరిశీలించి అక్కడి సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న గార్డుతో మాట్లాడారు. జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ నిర్వహించిన ఈ తనిఖీలో జిల్లా రెవిన్యూ అధికారి జె.వెంకటరావు, నెల్లిమర్ల తహశీల్దార్ జి.రాము, కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ అంజనీకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ గోదాములో ఈవీఎంలను భద్రపరుస్తారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వీటిని ఆయా జిల్లా ఎన్నికల అధికారులు ప్రతి నెలకోసారి తనిఖీ చేసి వాటి పరిస్థితిపై నివేదిక అందజేస్తారు. ప్రతి మూడు నెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించి వారి సమక్షంలో గోదాములను తెరచి చూస్తారు.
ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ - నెల్లిమర్ల ఈవీఎం గోడౌన్ తాజా వార్తలు
నెల్లిమర్లలో ఉన్న ఈవీఎం గోడౌన్ను విజయనగరం కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, నెల్లిమర్ల తహసీల్దార్ పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన విజయనగరం జిల్లా కలెక్టర్