తమ పంచాయతీకి ఎస్టీ రిజర్వేషన్ ఎలా కల్పించారంటూ విజయనగరం జిల్లా సీతానగరం మండలం జోగింపేట గ్రామస్థులు ధ్వజమెత్తారు. అధికారుల తీరుకు నిరసనగా పార్వతీపురం, బొబ్బిలి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దీనివల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించినా.. ఎన్నికలు బహిష్కరించినప్పటికీ తమకు న్యాయం జరగలేదన్నారు. 2011 లెక్కల ప్రకారం గ్రామ సమీపంలో ఎస్టీ హాస్టల్ నడుస్తుందని, అంతమాత్రనా ఎక్కడి నుంచో వచ్చిన విద్యార్ధులను గ్రామ జనాభా కింద లెక్కించడం సరైంది కాదన్నారు. సర్పంచ్ లేనందున తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ రిజర్వేషన్ను రద్దు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అధికారుల నిర్వాకం.. ఎస్టీలు లేని గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ - స్థానిక ఎన్నికల్లో ఎస్టీ రిజర్వేషన్ తాజా వార్తలు
ఎస్టీలు లేని గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్లు కల్పించడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని సీతానగరం మండలం జోగింపేట గ్రామస్థులు ప్రధాన రహదారిలో ధర్నాకు దిగారు. దీనివల్ల పార్వతీపురం బొబ్బిలి ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
![అధికారుల నిర్వాకం.. ఎస్టీలు లేని గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ Jogimpeta Villagers protest of ST reservation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6346077-259-6346077-1583736450870.jpg)
ఎస్టీలు లేని గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్లు కల్పించడంపై గ్రామస్థుల నిరసన
ఎస్టీలు లేని గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్లు కల్పించడంపై గ్రామస్థుల నిరసన
ఇవీ చూడండి: