ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Bhogapuram Airport Lands: 'రైతుల పేరుతో వైకాపా నేతలు భూపరిహారం కాజేస్తున్నారు'

Bhogapuram Airport Lands: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూముల పరిహారం విషయంపై.. జిల్లా కలెక్టర్​ సూర్యకుమారికి బాధితులు ఫిర్యాదు చేశారు. వైకాపా నేతలు పరిహారాన్ని కాజేస్తున్నారంటూ.. తెదేపా నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు.

Victims complaint to Collector on Bhogapuram land compensation at vizianagaram
భోగాపురం భూముల పరిహారంపై జిల్లా కలెక్టర్​కు బాధితుల ఫిర్యాదు

By

Published : Feb 14, 2022, 5:44 PM IST

భోగాపురం భూముల పరిహారంపై జిల్లా కలెక్టర్​కు బాధితుల ఫిర్యాదు

Bhogapuram Airport Lands: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూముల పరిహారం విషయంలో రైతుల పేరుతో.. వైకాపా నేతలు పరిహారాన్ని కాజేస్తున్నారంటూ బాధిత రైతులు విజయనగరం కలెక్టర్ సూర్యకుమారికి ఫిర్యాదు చేశారు. భోగాపురం మండలం కంచేరుపాలెం, చిట్టిపేట, గూడెపువలస, కౌలువాడ, బైరెడ్డిపాలెంకు చెందిన బాధితులు.. తెదేపా నేతలతో కలిసి స్పందన కార్యక్రమంలో కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

దశాబ్దాలుగా సాగులో ఉన్న భూముల్లో ఉన్న రైతులకు కాకుండా.. వారి బినామీల పేరుతో అధికార పార్టీ నేతలు పరిహారం కాజేస్తున్నారని ఆరోపించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుని.. అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్​కు విన్నవించారు. వైకాపా అధికారంలో అర్హులకు న్యాయం జరగటం లేదని బాధితులు వాపోయారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని.. తెదేపా నేతలు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details