కరోనా ప్రభావం రక్త నిధుల కేంద్రాలపైనా పడింది. రక్తదాతలు తగ్గిపోయిన కారణంగా.. నిల్వలు తరుగుతున్నాయి. ప్రస్తుతం విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 'ఓ' పాజిటివ్ యూనిట్లు 30 మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఆసుపత్రి సిబ్బంది ఓ ప్రకటన చేశారు. రక్తదానం చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే.. ఏసీ సౌకర్యం ఉన్న వాహనాన్ని దాత దగ్గరికే పంపిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు.. 94400 70099, 99599 78935 నంబర్లలో సంప్రదించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కె.సీతారామరాజు, వైద్యశాల నిర్వాహకులు బి.సత్యశ్రీనివాస్ పేర్కొన్నారు.
'రక్తదాతలూ ముందుకు రండి.. వాహనం పంపిస్తాం' - విజయనగరంలో రక్తం దానం
కరోనా లాక్డౌన్ కారణంగా రక్త నిధుల్లో నిల్వలు తగ్గిపోతున్నాయి. రక్తదానం చేసేవారు లేక... అత్యవసర వైద్య చికిత్సల సమయంలో ఇబ్బందిగా మారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి.. విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి ఓ మార్గం కనుగోంది. రక్తదానానికి ఎవరైనా ముందుకు వస్తామంటే.. వారి చెంతకే వాహనాన్ని పంపిస్తామని ప్రకటించింది.
!['రక్తదాతలూ ముందుకు రండి.. వాహనం పంపిస్తాం' Vehicle comes to home for blood donation in vizianagaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6785296-369-6785296-1586846526368.jpg)
విజయనగరంలో రక్తం దాన వాహనం