వైభవంగా మహారాజ సంగీత కళాశాల శతవసంత సంబరాలు - CULTURAL ACTIVITIES
విజయనగరం జిల్లాలోని మహారాజ సంగీత నృత్య కళాశాల శత జయంత్యుత్సవాలు ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా గాయని పి.సుశీల, ప్రముఖ గాయకుడు ఘంటసాల కుమారుడు పాల్గొన్నారు.
మహారాజ సంగీత, నృత్య కళాశాల శత జయంత్యుత్సవాలు
కళాశాల అధ్యాపకులు నారాయణ ఆధ్వర్యంలో శత గళార్చన, పూర్వ విద్యార్ధి రమణమూర్తి సారధ్యంలో నిర్వహించిన విజయనగరం, మృదంగ వైభవం ఎంతో ఆకట్టుకున్నాయి. ఇదే కళాశాలలో విద్యనభ్యసించిన సినీ గాయని పి. సుశీల, ప్రముఖ సినీ గాయకుడు ఘంటశాల కుమారుడు రత్నకుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఘంటశాల విగ్రహాన్ని ఆవిష్కరించారు. కళాశాలకు చెందిన పూర్వవిద్యార్థులు, వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. శత వసంతాల సంబరాలు మరో శతవసంతాలకు వెదజల్లేలా నిర్వహించటం అభినందనీయమన్నారు. ఘంటశాల విగ్రహం ఏర్పాటుపై ఆయన కుమారుడు రత్నకుమార్ ఆనందం వ్యక్తం చేశారు.