ఉగ్రరూపం దాల్చిన ఎండలు.. మహిళ మృతి - vadadebba
భానుడి తాపం పెరిగిపోతుంది. ఎండ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ తగిలి విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఓ మహిళ మృతి చెందింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ వడదెబ్బకు కుప్పకూలిపోయారు.
vadadebba-1
విజయనగరం జిల్లాలో ఎండలు ఉగ్రరూపం దాల్చాయి. పార్వతీపురంలో కళావతి అనే మహిళ వడదెబ్బ తగిలి మృతి చెందారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ డీఎస్.మూర్తి విధుల‌్లో ఉండగా వడదెబ్బ తగిలి కుప్పకూలిపోయారు. సిబ్బంది హుటాహుటిన ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలుగా నమోదవుతోంది. దీనికి వడగాల్పులు తోడవటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు.