పిల్లలపై మూడో దశ కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలతో... రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులపై, వారి తల్లులపై దృష్టి సారించింది. ఈ మేరకు ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు టీకా వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వారి కోసం విజయనగరం జిల్లాలో ప్రత్యేక వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పల్స్ పోలియో జాబితా ప్రకారం.... జిల్లాలో లక్షా 80వేల మంది తల్లులు ఉన్నట్లు గుర్తించారు. వీరందరికి వ్యాక్సిషన్ అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 84 కేంద్రాలు ఏర్పాటు చేశారు. టీకా వేసుకునేందుకు తొలిరోజు చిన్నారుల తల్లులు కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలొచ్చారు.
జిల్లాలో చిన్నారుల తల్లులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ - vaccination in vizianagaram district
విజయనగరం జిల్లాలో చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. జిల్లాలో 1.80 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులున్నట్లు అధికారులు గుర్తించారు. వారి కోసం 84 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జిల్లాలో చిన్నారుల తల్లులకు ప్రత్యేక వ్యాక్సినేషన్