విజయనగరం బాబా మెట్టలో సూఫీ సుగంధ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సూఫీ మహనీయులు హజరత్ ఖాదర్ వలీ బాబా 62వ మహా సూఫీ సందర్భంగా.. ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఉరుసు మహోత్సవాలను ప్రారంభించారు. దర్భార్ నుంచి అతావుల్లా బాబా కుమారులు ప్రత్యేకంగా రూపొందించిన చాదర్, గంధం, పుష్పాలు, సుగంధ ద్రవ్యాలను.. ఫకీర్ల ఖవ్వాలీలు, మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకెెళ్లారు.
దర్గాలోని ఖాదర్ బాబాకి ప్రత్యేక ప్రార్థనలు చేసి చాదర్ సమర్పించారు. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన జెండాను ఆవిష్కరించి ఉరుసు మహోత్సవాలు ప్రారంభమైనట్టు ప్రకటించారు. తదుపరి దర్బార్ లోని లంగర్ ఖానాలో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు.