ఏటా జరిగే పైడితల్లి అమ్మవారి పండుగలో పాల్గొనడం తమ కుటుంబ సంప్రదాయమని.. ఉత్సవం చూసేందుకు తమకు ఎవరి అనుమతి అవసరం లేదని ఊర్మిళ గజపతిరాజు అన్నారు. సిరిమానోత్సవంలో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత తమను అవమానించడంపై ఘాటుగా స్పందించారు.
'ఏటా మాదిరిగానే ఈ ఏడాది మా అమ్మతో కలిసి సిరిమానోత్సవం వీక్షించేందుకు వచ్చాను. మమ్మల్ని కోటలో చూసిన సంచయిత అవమానకరంగా మాట్లాడారు. పోలీసులు, ట్రస్ట్ అధికారులు మాపై మండిపడ్డారు. ముందు వరుసలో ఉన్న మమ్మల్ని వెనక్కు వెళ్లాలని మాన్సస్ ఈవో చెప్పారు. ఆయనను బతిమాలి కాసేపు కూర్చుని దర్శనం చేసుకుని వెళ్లాం. సంచయిత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. మా తాత, తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలా చేయలేదు. మాన్సస్ ట్రస్టును సంచయిత తన సొంత సంస్థలా భావించి అధికారం చెలాయిస్తున్నారు' అని ఊర్మిళ గజపతిరాజు అన్నారు.