ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వలసలు పెరుగుతాయి తప్ప.. ఒరిగేదేం లేదు' - భాజపా మాధవ్ తాజా వార్తలు

పరిపాలన వికేంద్రీకరణ వల్ల వలసలు పెరగటం తప్ప ఉపయోగం లేదని భాజాపా ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల మాత్రమే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

భాజాపా ఎమ్మెల్సీ మాధవ్
భాజాపా ఎమ్మెల్సీ మాధవ్

By

Published : Feb 11, 2020, 11:11 PM IST

పరిపాలన వికేంద్రీకరణ వల్ల లాభం ఉండదన్న ఎమ్మెల్సీ మాధవ్​

మూడు రాజధానుల ఏర్పాటుతో వలసలు పెరుగుతాయి తప్ప... ఒరిగేదేమీ లేదని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోతే నష్టమే తప్ప లాభం లేదన్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా మారితే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వలసలు పెరుగుతాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో మాత్రమే అభివృద్ధి సాధ్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో భాజపా బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్న మాధవ్.. బడ్జెట్​లో అన్ని రాష్ట్రాలకంటే ఏపీకి అధిక మెుత్తంలో నిధులు అందినట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details