ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒప్పంద ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ - విజయనగరంలో ఒప్పంద ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ వార్తలు

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో ఒప్పంద ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 14తో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియనున్నందున నిరుద్యోగులు బారులు తీరారు.

Unemployment on bargains for contract teacher posts
ఒప్పంద ఉపాధ్యాయ పోస్టులకు బారులు తీరిన నిరుద్యోగం

By

Published : Dec 12, 2019, 4:07 PM IST

ఒప్పంద ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అధిక సంఖ్యలో నిరుద్యోగులు

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ పాఠశాలలో ఖాళీగా ఉన్న వివిధ ఒప్పంద ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14ను తుది గడువుగా నిర్ణయించారు. ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి టెట్​లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. షెడ్యూల్ ప్రాంత ఖాళీలకు స్థానిక అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. క్రీడలు అనుభవం తదితర అంశాలకు ప్రత్యేక మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అధిక సంఖ్యలో నిరుద్యోగులు బారులు తీరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details