ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: 10 మందికి స్వల్ప గాయాలు - బర్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

విజయనగరం జిల్లా బర్లి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

two rtc buses dash in barli
బర్లి వద్ద ఆర్టీసీ బస్సులు ఢీ

By

Published : Jan 29, 2020, 1:15 PM IST

బర్లి వద్ద ఆర్టీసీ బస్సులు ఢీ
విజయనగరం జిల్లా బలిజపేట మండలం బర్లి వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బొబ్బిలి నుంచి అరసాడ వెళ్తున్న బస్సును.. ఉద్దవోలు నుంచి బొబ్బిలి వస్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సుల ముందు భాగం దెబ్బతింది. ఉద్దవోలు నుంచి వస్తున్న బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details