రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనలు విజయనగరం జిల్లా ఎస్ కోట మండలంలో చోటు చేసుకుంది. విశాఖ జిల్లా అనంతగిరి మండలం పినకోట గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అరకు వెళ్తుండగా వాహనం అదుపు తప్పి ఇంటిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వెనక కూర్చున్న వ్యక్తి మృతిచెందగా వాహనం నడుపుతున్న వ్యక్తి తలకు తీవ్ర గాయమై చికిత్స పొందుతున్నాడు.
విజయనగరంలో విషాదం.. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి - two members dead in road accident at vizainagaram district s kota
విజయనగరం జిల్లా ఎస్ కోట మండలంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరు మృతి చెందగా, ముందు వెళ్తున్న బోర్ లారీ నుంచి పైపు పడి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మరణించారు.

విజయనగరంలో విషాదం.. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
విజయనగరంలో విషాదం.. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ఇదే మండలంలో వెంకటరమణపేట గ్రామ కూడలి వద్ద ఎస్.కోట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తిపై ముందు వెళ్తున్న బోర్ లారీ నుంచి పైపు పడి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్.కోట ఎస్ఐ నీలకంఠం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి..విజయనగరంలో ఏనుగుల దాడి.. మహిళ మృతి