Two lorries collided On National Highway : విజయనగరం జిల్లా గజపతి నగరం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. సాలూరు వైపు నుంచి వస్తున్న ట్యాంక్ లారీ.., ఒడిశా వైపు వెల్తున్న బొగ్గు లారీ బలంగా ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇరు లారీల డ్రైవర్లు, క్లీనర్లు నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. క్షత గాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో గజపతి నగరంలో ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయత్, సభబ్, ఛతీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన గురు చరణ్ సింగ్, షలిష్ గా గుర్తించారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయిన పత్తి :కర్నూలు జిల్లా ఆదోనిలోని పత్తి పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాధవరం రోడ్డులో ఉన్న నాగరాజు అండ్ సన్స్ కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పత్తి కాలిపోయింది. అగ్ని ప్రమాదంలో నాలుగు కోట్లు విలువ చేసే పత్తి కాలి బూడిద అయ్యయిందని యజమాని వాపోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పరిశ్రమలో 10 కోట్ల వరకు పత్తి నిల్వలు ఉన్నాయని, కూలీలు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో చాలా పత్తి బేలు కాలిపోకుండా చూశారని యాజమాని నాగరాజు తెలిపారు.