ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 16, 2020, 8:43 AM IST

ETV Bharat / state

జిల్లాలో 2.74 లక్షల మందికి 'రైతు భరోసా'

వైఎస్​ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని... ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా పాలనాధికారి హరి జవహర్ లాల్, పలువురు రైతులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు. ఈ పథకం జిల్లాలో సుమారు 2లక్షల మంది రైతులకు వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు.

two lakh farmers are eligible to farmer Guarantee scheme in Vizianagaram
విజయనగంలో 2లక్షల మంది రైతులకు రైతు భరోసా వర్తింపు

విజయనగంలో 2లక్షల మంది రైతులకు రైతు భరోసా వర్తింపు

వైఎస్​ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని... ముఖ్యమంత్రి వైఎస్​ జగన్ ప్రారంభించారు. విజయనగరం జిల్లాలోని కొంతమంది రైతుల సమక్షంలో... వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నామని జిల్లా పాలనాధికారి హరి జవహర్​లాల్​ తెలిపారు.

రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో... 2 లక్షల 44వేల 302 మంది భూ యజమానులకు, మ్యుటేషన్ ద్వారా సంక్రమించిన 7950 కుటుంబాలకు, ఆన్​ సీడెడ్ వెబ్​ ల్యాండ్ ద్వారా 9036 మందికి, అటవీ పట్టా భూముల ద్వారా 8629 మందికి.. వెరసి 2లక్షల 74 వేల 561మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందన్నారు.

గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 16 వేల 908మంది రైతులు అదనంగా ఈ పథకానికి అర్హులుగా నమోదయ్యారని తెలిపారు. అందరికీ ఈ పథకం అమలవుతుందన్నారు.

ఇదీ చదవండి:

విజయనగరంలో ముగ్గురు వలస కూలీలకు కరోనా

ABOUT THE AUTHOR

...view details