విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కితంపాలెం నవోదయ పాఠశాల సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. గంట్యాడ మండలం కొండతామరపల్లికి చెందిన శ్రీనివాసరావు, తాడిపూడి గ్రామానికి చెందిన గౌరునాయుడు ఇద్దరు ద్విచక్రవాహనంపై బొడ్డవర కు వెళ్లి తిరిగి వస్తుండగా... చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసరావు ఆర్టీసీ బస్సు డ్రైవర్గా పనిచేస్తుండగా, గౌరు నాయుడు వ్యవసాయం చేస్తున్నాడు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నీలకంఠం తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - విజయనగరం జిల్లా నేర వార్తలు
విజయనగరం జిల్లా కితంపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
![రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి Two killed in road accident in kithampalem vizianagaram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7062513-87-7062513-1588616414153.jpg)
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి