విజయనగరం జిల్లా సాలూరు చెందిన గాయత్రి , లావణ్యలు తాము దాచుకున్న డబ్బులతో 65 మంది నిరుపేద దివ్యాంగులకు నిత్యావసర సరుకులను పంచిపెట్టారు. వీటిని సాలూరు సీఐ సింహాద్రి నాయుడు, పట్టణ ఎస్సై శ్రీనివాస్ చేతులు మీదుగా పంపిణీ చేశారు. వారి పరిసర ప్రాంతంలో ఉంటున్న ఓ వృద్దుడిని చూసి ఈ ఇద్దరమ్మాయిలకు ఈ ఆలోచన వచ్చింది. అంగవైకల్యంతో బాధపడుతున్న ఆ తాతను చూసి వారి వద్దనున్న 25 వేల రూపాయలను వాళ్ల సొంత ఖర్చులకు ఉపయోగించకుండా... ఆ తాతలా ఉన్న వారికి సహాయపడాలని అనుకున్నారు. అదే తడవుగా నెలకు సరిపడే నిత్యావసర సరుకులు, దుప్పట్లు, గ్లూకోజు, ఆకుకూరలు వంటివి తీసుకుని ఇచ్చారు. వీరి పెద్దమనసు చూసి తల్లిదండ్రులు సంతోషపడ్డారు.
65 మంది దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ - saluru latest news
అమ్మాయిలు సాధారణంగా వారి వద్ద దాచుకున్న డబ్బులతో బంగారమో, ఇతర వస్తువులో కొనాలని భావిస్తారు. అదే చిన్నవారైతే వారికి ఉన్న చిన్న చిన్న కోరికలు తీర్చుకునేందుకు ఉపయోగిస్తారు. కానీ సాలూరులో ఓ ఇద్దరమ్మాయిలు చాలా పెద్ద మనసు చేసుకుని తాము దాచుకున్న నగదుతో పేద దివ్యాంగులకు నిత్యావసరాలు పంచిపెట్టారు.
దివ్యాంగులుకు నిత్యావసరాలు పంచుతున్న సాలూరు అమ్మాయిలు