Death: విజయనగరం జిల్లా గరివిడి మండలం కుమరాంలో విషాదం చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోడకూలి లక్ష్మి, అశోక్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అడ్డాల లక్ష్మి(47) అశోక్ కుమార్ రాజు (5) నానమ్మ, మనవడిగా గుర్తించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందటంతో.. కుమరాంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
విజయనగరంలో విషాదం.. వర్షాలకు గోడకూలి నానమ్మ, మనవడు మృతి
Death: రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు.. వాగులు, వంకలు పొంగిపొర్లుతువన్నాయి. ఆ వర్షధాటికి గాను ఓ పెంకుటిల్లు కూలి.. ఇద్దరు మృతిచెందిన విషాదకర ఘటన.. విజయనగరంలో జరిగింది. అడ్డాల లక్ష్మి(47) అశోక్ కుమార్ రాజు (5) నానమ్మ, మనవడు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
వర్షాలకు గోడకూలి నానమ్మ, మనవడు మృతి