ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

two children drowned: చంపావతి నదీలో ఇద్దరు చిన్నారుల గల్లంతు - vizainagaram district latest news

two children drowned: విజయనగరం జిల్లాలో ఘోరం జరిగింది. చంపావతి నదీలో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలను చేపట్టారు.

చంపావతి నదీలో ఇద్దరు చిన్నారులు గల్లంతు
చంపావతి నదీలో ఇద్దరు చిన్నారులు గల్లంతు

By

Published : Nov 23, 2021, 9:27 AM IST

two children drowned: విజయనగరం జిల్లా డెంకాడ మండలం గునుపూరులో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులు చంపావతి నదీలో గల్లంతయ్యారు. గునూపురుకు చెందిన ముగ్గురు బాలికలు, ఇద్దరు యువతులు వారి కుటుంబాలతో కలిసి సమీపంలో ఉన్న చంపావతి నదీకి వెళ్లారు. ఒడ్డున స్నానం చేసిన అనంతరం ఈ ఐదుగురు ఆడుకుంటూ నదీ మధ్యలోకి వెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు. వీరి ఆర్తనాదాలు విన్న కొందరు యువకులు ముగ్గురిని ప్రాణాలతో బయటకు తీశారు. మరో ఇద్దరి జాడ తెలియరాలేదు.

two children drowned: విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోని గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటికి ఇంటర్ చదువుతున్న భార్గవి మృతదేహం లభ్యమైంది. ఏడో తరగతి చదువుతున్న శిరీష ఆచూకీ లభ్యం కాలేదు. ప్రాణాలతో బయటపడ్డ లావణ్య, రమణి, రూపలను విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:CBN Kadapa Tour: ఆ జిల్లాల వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

ABOUT THE AUTHOR

...view details