పిడుగుపాటుకు రెండు మూగజీవాలు మృతి - two animals died with thunderbolt at vizainagaram district
పిడుగుపాటుకు ఆవు, ఎద్దు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా అంటివలస గ్రామంలో జరిగింది. పశువుల మృతితో యజమానులు కన్నీటిపర్యంతమయ్యారు.
పిడుగుపాటుకు రెండు మూగజీవాలు మృతి
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం అంటివలస గ్రామంలో పిడుగుపాటుకు రెండు మూగ జీవాలు మృతి చెందాయి. రైతులు పోలంలో పశువులను మేపుతున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం ప్రారంభమైన కొన్ని క్షణాలకే పిడుగుపడి ఓ ఆవు, ఎద్దు మృత్యువాత పడ్డాయి.