Lorry overturned: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్ల సీతారాంపురం వద్ద అక్రమంగా పశువులను తరలిస్తున్న వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 27 పశువులు మృతి చెందాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. పార్వతీపురం జిల్లా గుమడ నుంచి తెలంగాణలోని హైదరాబాద్కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అతివేగంగా వ్యాన్ నడపడంతో అర్ధరాతి సమయంలో అదుపుతప్పి బోల్తా పడిందని తెలిపారు. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వ్యాన్లో కిక్కిరిసి ఆవులను తరలించడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మృతి చెందిన ఆవులను పూడ్చివేయించారు. గాయపడినవాటిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Lorry overturned: వ్యాన్ బోల్తా... 27 పశువులు మృతి... ఎక్కడంటే..? - విజయనగరం జిల్లా తాజా వార్తలు
Lorry overturned: విజయనగరం జిల్లాలో అక్రమంగా పశువుల్ని తరలిస్తున్న వ్యాన్ బోల్తాపడడంతో 27 మూగజీవాలు మృతి చెందాయి. మరికొన్ని పశువులు తీవ్రంగా గాయపడ్డాయి. అతివేగంగా వ్యాన్ నడపడంతో అదుపుతప్పి బోల్తా పడనట్లు తెలుస్తోంది.
![Lorry overturned: వ్యాన్ బోల్తా... 27 పశువులు మృతి... ఎక్కడంటే..? Lorry overturned](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16541099-950-16541099-1664781780369.jpg)
లారీ బోల్తా
Last Updated : Oct 3, 2022, 2:20 PM IST