ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్నికి ఆహుతైన పూరిళ్లు.. బాణసంచా కారణంగా ప్రమాదం - fire accidents in diwali celebrations

వెలుగుల పండగ కొంతమంది పేదల ఇళ్లల్లో చీకట్లు మిగిల్చింది. దీపావళి సంబరాల్లో భాగంగా కాల్చిన బాణసంచా కారణంగా పలు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. అందరూ వేడుకల్లో మునిగితేలుతున్న వేళ ఈ విషాదం బాధితులకు కన్నీరు మిగిల్చింది.

huts burnt
అగ్నిప్రమాదంలో కాలిపోతున్న పూరిల్లు

By

Published : Nov 15, 2020, 8:57 AM IST

విజయనగరం జిల్లాలోని పలు గ్రామాల్లో దీపావళి బాణసంచా కారణంగా అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో పన్నెండు పూరిళ్లతో పాటు ఒక పశువుల పాక దగ్ధమైంది. గుర్ల మండలం తాతవారికిట్టిల్లి, బలిజపేట మండలం మిర్తివలసలో ఐదు చొప్పున పూరిళ్లు దగ్ధమయ్యాయి. పురిటిపెంటలో ఒక పూరి పాక అగ్నికి ఆహుతి అయ్యింది. గంట్యాడలో ఒక పశువుల పాక కాలిపోగా..అందులో ఉన్న ఆవు, దూడ మరణించాయి. యాతపేటలోనూ ఒక గుడిసె అగ్నిప్రమాదంలో కాలిపోయింది. ఈ ఘటనల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details