విజయనగరం జిల్లా వివాదస్పద కొఠియా గ్రామాల్లో ఒడిశా అధికారుల నుంచి అడ్డంకులు తప్పడం లేదు. ఆయా గ్రామాల్లో పెన్షన్లు అందజేయడానికి సోమవారం వెళ్లిన ఏపీ అధికారులు, వాలంటీర్లను.. ఒడిశా అధికారులు అడ్డుకున్నారు. దీంతో.. పలు గ్రామాల వారికి పెన్షన్ అందలేదు. గంజాయి ఫాదర్ పంచాయతీలోని దిగువ సెంభి గ్రామానికి చెందిన వారికి.. డూలి భద్ర గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశారు. సిమ్మగెడ్డతో పాటు మరో రెండు గ్రామాల వారికి ఫించన్ల పంపిణీ జరగలేదు. దిగువ గంజాయ్ భద్ర, ఎగువ గంజాయ్ భద్ర గ్రామాల్లో స్థానికంగా వలంటీర్లు ఉండటంతో పెన్షన్ల పంపిణీ జరిగింది.
వివాదస్పద కొఠియా గ్రామాల్లో.. ఒడిశా అధికారుల అడ్డంకులు - vizayanagaram district latest news
వివాదస్పద కొఠియా గ్రామాల్లో ఒడిశా అధికారుల నుంచి అడ్డంకులు తప్పడం లేదు. సోమవారం ఆయా గ్రామాల్లో పెన్షన్లు అందజేయనీయకుండా ఏపీ అధికారులు, వలంటీర్లను ఒడిశా అధికారులు అడ్డుకున్నారు.
వివాదస్పద కొఠియా గ్రామాల్లో ఒడిశా అధికారుల అడ్డంకులు
ఇదీ చదవండి: