విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఆంధ్రా, ఒడిశా ఘాట్ రోడ్డులో ఓ ట్రాలీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందగా, క్లీనర్ పరిస్థితి విషమంగా ఉంది. రాజస్థాన్ నుంచి విశాఖపట్నంకు ట్రాలీలో అల్యూమినియం లోడు తీసుకువస్తుండగా.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు దగ్గరలో ఉన్న రోడ్డవలస సమీపంలో ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్‌కి గాయాలుకాగా.. సాలూరు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని.. పాచిపెంట పోలీసులు తెలిపారు.
రోడ్డవలస సమీపంలో ట్రాలీ బోల్తా..డ్రైవర్ మృతి - రోడ్డవలసలో రోడ్డుప్రమాదం వార్తలు
విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఆంధ్ర, ఒడిశా ఘాట్ రోడ్డులో ఓ ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందగా, క్లీనర్ పరిస్థితి విషమంగా ఉంది.

రోడ్డవలస సమీపంలో ట్రాలీ బోల్తా