విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పొర్లు గ్రామానికి చెందిన చంద్రమ్మకు నెలలు నిండిన కారణంగా.. కుటుంబీకులు, బంధువుల సాయంతో డోలీలో ఆస్పత్రికి తరలించారు. కొండ ప్రాంతంలో సరైన రోడ్డు మార్గం లేక.. సుమారు పది కిలోమీటర్లు నడిచి డబ్బాగుంటకు మోసుకు వెళ్లారు. అక్కడి నుంచి 108 వాహనంలో శృంగవరపుకోట సామాజిక ఆస్పత్రికి తరలించారు. గర్భిణికి సుఖ ప్రసవమైంది. కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
గిరిపుత్రుల డోలీ కష్టాలు... వైద్య చికిత్సకు తీవ్ర అవస్థలు - విజయనగరం జిల్లా నేటి వార్తలు
విజయనగరం జిల్లా గిరిజనుల డోలీ కష్టాలు ఏమాత్రం తీరడం లేదు. కొండ ప్రాంతాల్లో సరైన రోడ్డు సదుపాయం లేక డోలీలతో నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా శృంగవరపుకోట మండలం పొర్లు గ్రామానికి చెందిన ఓ మహిళకు వైద్య చికిత్స అందించేందుకు డోలీని ఆశ్రయించారు ఆ గిరిపుత్రులు.
గిరిపుత్రుల డోలీ కష్టాలు... వైద్య చికిత్సకు తీవ్ర అవస్థలు