విజయనగరం జిల్లా సాలూరు మండలం పోయిమాల గ్రామానికి చెందిన ఓ వివాహిత జ్వరంతో బాధ పడుతోంది. సమీపంలో ఆస్పత్రి లేకపోవటంతో అతి కష్టం మీద తొమ్మిది కిలోమీటర్లు... డోలీలో మోసి, మక్కువలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో కొరవడిన వైద్య సేవలకు ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించాలని.. తమ సమస్యకు పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు.
మహిళకు జ్వరం.. చికిత్స కోసం 9 కిలోమీటర్ల డోలీపై ప్రయాణం - విజయనగరం జిల్లాలో గిరిజనుల అవస్థలు
విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని గిరిజన గ్రామాల్లో సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం, రోడ్లు, తాగునీరు అందక దుర్భర జీవితం గడుపుతున్నారు. పోయిమాల గ్రామానికి చెందిన ఓ మహిళకు జ్వరం రావటంతో అతి కష్టం మీద ఆస్పత్రికి తరలించారు.
![మహిళకు జ్వరం.. చికిత్స కోసం 9 కిలోమీటర్ల డోలీపై ప్రయాణం tribes problems for health treatment in vizianagaram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8724214-803-8724214-1599559235226.jpg)
చికిత్స కోసం రోగిని డోలీలో మోస్తున్న గిరిజనులు
చికిత్స కోసం రోగిని డోలీలో మోస్తున్న గిరిజనులు