విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని సబ్ ప్లాన్ మండలాల్లో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజనుల ఆందోళన చేపట్టారు. రెండు రోజులపాటు పాదయాత్ర నిర్వహించారు. కురపాంలో ఆదివారం ప్రారంభమైన పాదయాత్ర సోమవారం మధ్యాహ్నం నాటికి ఐటీడీఏ కార్యాలయం చేరుకుంది. బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని.. జీవో నెంబర్ 3ని యధాతథంగా అమలు చేయాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారానికి గిరిపుత్రుల పాదయాత్ర - విజయనగరం జిల్లాలో పాదయాత్ర తాజా వార్తలు
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గిరిజనులు రెండు రోజులపాటు పాదయాత్ర నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పార్వతీపురం అభివృద్ధి సంస్థ పీఓ కూర్మనాథ్కి వినతి పత్రం అందజేశారు.
సమస్యల పరిష్కారానికి గిరిపుత్రులు పాదయాత్ర
కురుపాంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం చేయాలని, నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని, జీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వివరిస్తూ పీవో కూర్మనాథ్కి వినతి పత్రం అందజేశారు. సమస్యలను చూసిన ఆయన దశలవారీగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గిరిజన సంఘం నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...