ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వాళ్ల ఆంక్షలు దాటుకుని వచ్చాం.. వీళ్లు కూడా ఓటు వేయనివ్వడం లేదు' - ఈరోజు విజయనగరంలో గిరిజనులు ఆందోళన వార్తలు

తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు సహకరించాలని కోరుతూ.. గిరి శిఖర గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

Tribes are worried
గిరిజనులు ఆందోళన

By

Published : Apr 8, 2021, 6:43 PM IST

ఎంతో కష్టపడి ఒడిశా అధికారుల కళ్లు కప్పి తామంతా ఇంత దూరం వస్తే.. ఆంధ్ర అధికారులు సైతం ఓటు వేయడాన్ని అడ్డుకుంటున్నారని గిరిశిఖర గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు సహకరించాలంటూ.. విజయనగరం జిల్లా పరిధిలో.. ఒడిశా సరిహద్దు గ్రామాల ఓటర్లు ఆందోళనకు దిగారు.

పట్టు చెన్నారు, పగులు చెనారు గ్రామాల గిరిజనులు.. తొణం పోలింగ్ బూత్ ముందు బైటాయించి నిరసన తెలిపారు. అధికారులు వచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టేంతవరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. సరైన గుర్తింపు కార్డులు లేని కారణంగా వారు ఓటు వేసే అవకాశం లేకుండా పోయిందని అధికారులు చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details