ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యం చేయించాలంటే డోలీ మోయాల్సిందే.. ! - విజయనగరం జిల్లా వార్తలు

ఎక్కడో దూరంగా విసిరేసినట్టు ఉండే గూడేలు వారివి. కనీస సౌకర్యాలు అంతంత మాత్రమే. ఇక ఎవరికైనా జబ్బు చేస్తే దేవుడిపై భారం వేయాల్సిందే. రోగిని డోలిపై మోస్తూ కొండలు, వాగులు, వంకలు దాటుతూ ప్రయాణం చేయాల్సిందే. తాజాగా పురిటి నొప్పులు పడుతున్న ఓ మహిళను డోలీలో ఆస్పత్రికి తరలించిన ఘటన విజయనగరం జిల్లా కురుపాంలో... అక్కడి పరిస్థితికి అద్దం పట్టింది.

tribe people problems for medical treatment in vizianagaram district
వైద్యం చేయించాలంటే డోలీ మోయాల్సిందే.. !

By

Published : Sep 29, 2020, 6:05 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని కురుపాం మండలం వలసబల్లేరు గ్రామపంచాయతీ చాపరాయిగూడ గ్రామానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో ఇబ్బందులు పడింది. గమనించిన కుటుంబీకులు బాధితురాలని డోలిపై మోస్తూ.. కొండలు, వాగులు దాటుతూ... 4 కిలోమీటర్లు నడిచి ఫీడర్ అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తరలించారు. తమ గ్రామానికి సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details