ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాం' - షెడ్యూల్డ్ సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్

షెడ్యూల్డ్ సర్టిఫికెట్లు జారీ చేయకపోవడాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా సాలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు బైఠాయించారు. సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని.. అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

tribals protest for caste certificate
షెడ్యూల్డ్ సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్

By

Published : Mar 16, 2021, 9:56 PM IST

షెడ్యూల్డ్ సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ.. విజయనగరం జిల్లా సాలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు బైఠాయించి నిరసన చేపట్టారు. గిరిజన గ్రామాల్లో నివాసముంటున్న యువతకు షెడ్యూల్డ్ సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని గిరిజన నాయకుడు కొండగొర్రి ఉదయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని పట్టుబట్టారు. దీంతో పట్టణ ఎస్సై ఫక్రుద్దీన్.. గిరిజన ప్రతినిధులు, తహసీల్దార్​తో చర్చలు జరిపారు.

ఈ విషయంలో తామేమీ చేయలేమని.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తేనే సర్టిఫికెట్లు జారీ చేయగలమని తహసీల్దార్ స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్లే ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోతున్నామని భావిస్తే.. కోర్టును ఆశ్రయించాలని ఆయన సూచించారు. దీంతో గిరిజనులు ఆందోళన విరమించారు.

సుదీర్ఘకాలంగా జగ్గుదొరవలస గ్రామంలో నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని గిరిజన నాయకుడు కొండగొర్రి ఉదయ్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో ఏజెన్సీ సర్టిఫికెట్లు ద్వారా గిరిజనులు ఉద్యోగాలు పొందేవారు. కానీ ప్రస్తుతం ఏజెన్సీ సర్టిఫికెట్​కు బదులుగా షెడ్యూల్డ్ సర్టిఫికెట్లను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో సర్టిఫికెట్ల జారీని రెవెన్యూ అధికారులు నిలిపివేసినట్లు సమాచారం.

ఇదీ చూడండి:

సీఐడీ పెట్టిన కేసులు కోర్టులో చెల్లవు: తెదేపా ఎంపీలు

ABOUT THE AUTHOR

...view details