ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గవర్నర్ వచ్చే వరకు ఎలాంటి పండుగలు చేసుకోం' - పార్వతీపురం సబ్ ప్లాన్

తమ సమస్యను పరిష్కరించేందుకు గవర్నర్ వచ్చే వరకు తాము ఎలాంటి పండుగలు చేసుకోబోమని.. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని తుంద పంచాయితీ, జగ్గు దొర వలస గిరిజనులు తేల్చి చెప్పారు. గిరిజనుల హక్కుల కోసం చేస్తున్న దీక్ష 50వ రోజు చేరుకోవడంతో వారు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు.

tribals demand to governor
గిరిజనుల హక్కుల కోసం చేస్తున్న దీక్ష

By

Published : Jan 15, 2021, 9:01 PM IST

గిరిజనుల హక్కుల కోసం విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని తుంద పంచాయితీ.. జగ్గు దొర వలస గ్రామంలో చేస్తున్న దీక్ష 50వ రోజుకు చేరుకోవడంతో గిరిజనులు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. దేశం మొత్తం సంక్రాంతి సంబురాలు జరుపుకుంటే.. వలస గ్రామ పరిసర గిరిజనులు మాత్రం తమ హక్కుల పరిరక్షణ కోసం ఇలా వినూత్న ప్రదర్శన చేపట్టారు.

తమ సమస్యను పరిష్కరించేందుకు గ్రామానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వచ్చే వరకు తాము ఎటువంటి పండుగలు చేసుకోబోమని అక్కడి గిరిజనులు తేల్చి చెప్తున్నారు. పార్వతీపురం సబ్ ప్లాన్ మండలాల్లో 1496 గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాలుగా గుర్తించి గిరిజనులను ఉద్యోగాల్లో నియమించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:గజరాజుల బీభత్సం.. కళ్లాల్లో ధాన్యం ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details