ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సొంతంగా 5 కిలోమీటర్ల రోడ్డును నిర్మించుకున్న గిరిజనులు

అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండదని భావించిన ఆ గిరిజనులు ఏకంగా 5 కిలోమీటర్ల రోడ్డును వేసుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ, పోయిమాలలోని 31 గిరిజన కుటుంబాలు.. ఒక్కో కుటుంబం నుంచి రూ.13 వేలు సేకరించి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.

road constriction
రోడ్డు నిర్మాణం

By

Published : Jun 23, 2021, 1:15 PM IST

రోడ్డు నిర్మాణం చేపట్టాలని అనేక సంవత్సరాలుగా అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగి విసిగి పోయిన ఆ గిరిజనులు.. సొంతంగా డబ్బులు జమచేసుకుని రోడ్డు వేసుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ, పోయిమాలలోని మొత్తం 31 కుటుంబాలు ఉన్నాయి. రోడ్డు సదుపాయం లేక పోవడంతో అత్యవసర సమయాల్లో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు వేయాలని ఐటీడీఏ అధికారులు, నాయకుల చుట్టూ తిరిగారు.

ఎవరు స్పందించకపోవడంతో వారే సొంతంగా రోడ్డు నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఒక్కో కుటుంబం నుంచి రూ.13 వేల చొప్పున వేసుకుని మొత్తం 4 లక్షల రూపాయలు పోగు చేసుకుని రోడ్డు నిర్మించుకున్నారు. సిరివర నుంచి పోయిమాల వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర రోడ్డు వేసుకున్నారు. రోడ్డు నిర్మాణం కోసం బంగారం, ఇతర ఆస్తులను అమ్మి నగదు జమ చేసుకున్నామని గిరిజనులు తెలిపారు. ఇన్ని ఏళ్లుగా రోడ్డు నిర్మాణం కోసం తిరిగినా ఉపయోగం లేకుండా పోయందని..నాయకులు, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details