ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీవో నెంబర్​ 3ను కొనసాగించాలని గిరిజనుల ఆందోళన - vizianagaram distric today news update

జీవో నెంబర్​ 3 సాధన కమిటీ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఐటీడీఏ ఏదుట గిరిజనులు, పలు సంఘాల నాయకులు నిరసన తెలిపారు. జీవో నెంబర్ 3ను యధాతథంగా కొనసాగించాలని.. ప్రైవేటు రంగంలోనూ ఆదివాసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్​ చేశారు.

Tribal protest demanding cancellation of o number 3
జీవో నెంబర్​ 3ను రద్దు చేయాలని కోరుతూ గిరిజనుల నిరసన

By

Published : Jun 19, 2020, 7:15 PM IST

జీవో నెంబర్​3 రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరుతూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో గిరిజన సంఘం నిరసన చేపట్టింది. ఐటీడీఏ వద్ద జీవో నెంబర్ 3 సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 3ను యధాతథంగా కొనసాగించాలని కోరిన నిరసనకారులు... గిరిజన ప్రాంతంలోని ప్రతి శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details