'ఏజెన్సీలో పాగావేసి పదవులు పొందుతున్నారు'
'ఏజెన్సీలో పాగావేసి పదవులు పొందుతున్నారు' - పార్వతీపురంలో గిరిజన సంఘం జిల్లా మహాసభలు
పార్వతీపురంలోని ఐటీడీఏ సామాజిక భవనంలో గిరిజన సంఘం జిల్లా 5వ మహసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.అప్పలనరసయ్య హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన హక్కుల సాధనే సంఘం లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. గిరిజనేతరులు ఏజెన్సీలో పాగావేసి పదవులు పొందుతున్నారని ఆరోపించారు. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిపైన ఈ విషయమై కోర్టుకు వెళ్లామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు గిరిజనులని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
!['ఏజెన్సీలో పాగావేసి పదవులు పొందుతున్నారు' పార్వతీపురంలో గిరిజన సంఘం జిల్లా మహాసభలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5570768-939-5570768-1577967973838.jpg)
పార్వతీపురంలో గిరిజన సంఘం జిల్లా మహాసభలు