ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గట్టుకు కోత.. జైకా నిధులు వస్తేనే పనులు చేస్తారట! - విజయనగరం మక్కువ జలాశయం వార్తలు

విజయనగరం జిల్లా మక్కువలోని వెంగళరాయ సాగర్‌ జలాశయం గట్టు... కోతకు గురవుతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం తగ్గిన పరిస్థితుల్లో రంధ్రం బయటపడింది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Vengalaraya Sagar reservoir
విజయనగరం మక్కువలో గట్టుకు రంథ్రం

By

Published : Apr 27, 2020, 12:46 PM IST

మక్కువ పరిధిలోని వెంగళరాయ సాగర్‌ జలాశయం గట్టు... కోతకు గురవుతోంది. ఎడమ కాలువ తూము గట్టుపై రెండు మీటర్ల వెడల్పు, పొడువుతో గొయ్యి ఏర్పడింది. దాని ద్వారా నీరు కాలువలో కలిసి వృథాగా పోతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం తగ్గిన కారణంగా ఈ రంధ్రం బయటపడింది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తూము పైపులైను శ్లాబు దెబ్బతిన్న కారణంగానే రంధ్రం ఏర్పడిందని వీఆర్‌ఎస్‌ జేఈ రాజశేఖర్ చెప్పారు. జైకా నిధులతోనే పనులు చేయగలమన్నారు.

ABOUT THE AUTHOR

...view details