ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిషత్​ ఎన్నికల నిర్వాహణపై సిబ్బందికి శిక్షణ తరగతులు

పరిషత్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై సిబ్బందికి అధికారులు అవ‌గాహ‌న క‌ల్పించారు. విజయనగరం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఎన్నిక‌ల శిక్షణాధికారి అప్ప‌ల‌నాయుడు ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేశారు.

training for elections on mptcs and zptcs
పరిషత్​ ఎన్నికల నిర్వాహణపై సిబ్బందికి అవగాహన

By

Published : Apr 5, 2021, 1:05 AM IST

జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల నేపథ్యంలో ఎన్నిక‌ల సిబ్బందికి అవ‌గాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు విజయనగరం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జడ్పీ సీఈవో వెంక‌టేశ్వ‌రరావు, ఎన్నికల ప్ర‌త్యేక అధికారి శ్రీధ‌ర్ రాజు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వహించారు. మొద‌టి రోజు పీవోలు, ఏపీవోల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌గా.. రెండో రోజు ఆదివారం జోన‌ల్, రూట్‌, ఎఫ్​ఎస్​టీ ఎస్​ఎస్​ఎస్‌టీల‌కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్నిక‌ల శిక్షణాధికారి అప్ప‌ల‌నాయుడు ప‌లు అంశాల‌పై సిబ్బందికి గ‌తంలో జ‌రిగిన అనుభ‌వాల‌ను వివరించారు.

పరిషత్ ఎన్నిక‌ల‌ను విజ‌య‌వంతం చేయాలి..

ఎన్నిక‌ల‌ను స‌జావుగా, ప్రశాంతంగా నిర్వ‌హించాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌ని జ‌డ్పీ సీఈవో వెంక‌టేశ్వ‌రరావు అన్నారు. అంద‌రూ స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి పరిషత్ ఎన్నిక‌లు విజ‌య‌వంతం చేయాల‌న్నారు.

ఇదీ చదవండి:

తిరుపతి: పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న జాతీయ విద్యాసంస్థలు

ABOUT THE AUTHOR

...view details