ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయ శాఖ సిబ్బందికి 'డిజిటల్' శిక్షణ - digital kiosk machine in parvatipuram

విజయనగరం జిల్లా పార్వతీపురంలో వ్యవసాయ శాఖ సిబ్బందికి డిజిటల్ కియోస్క్ యంత్ర వినియోగంపై శిక్షణ ప్రారంభమైంది. ఎమ్మెల్యే అలజంగి జోగారావు శిక్షణను పరిశీలించారు.

Training on digital kiosk machine usage for Agriculture Department staff  in parvatipuram
వ్యవసాయ శాఖ సిబ్బందికి డిజిటల్ కియోస్క్ యంత్ర వినియోగంపై శిక్షణ

By

Published : May 12, 2020, 5:31 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో వ్యవసాయ శాఖ సిబ్బందికి డిజిటల్ కియోస్క్ యంత్ర వినియోగంపై.. అధికారులు శిక్షణ ఇస్తున్నారు. మార్కెట్ యార్డు వద్ద రైతు భరోసా కేంద్రంలో జరుగుతున్న ఈ శిక్షణ తీరును ఎమ్మెల్యే అలజంగి జోగారావు పరిశీలించారు. యంత్రం పనితీరు, ప్రయోజనాలను నిపుణులు వివరించారు.

సచివాలయాల్లో ఉన్న గ్రామీణ వ్యవసాయ సహాయకులకు ఈ యంత్రం పై అవగాహన కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. గ్రామ పరిధిలో అన్ని పంటలను ఈ-పాస్ విధానంలో నమోదుచేసి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.

రైతులు సచివాలయానికి వచ్చి తమకు అవసరమైన విత్తనాలు పొందేలా చేస్తున్న ఈ ప్రయత్నానికి అంతా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఆధునిక యంత్రంలో వివరాలు నమోదును నిపుణులు ఎమ్మెల్యేకి వివరించారు.

ఇదీ చూడండి:

తాగిన మైకంలో.. మరణాన్ని హత్తుకున్నాడు!

ABOUT THE AUTHOR

...view details