విజయనగరం జిల్లా పార్వతీపురంలోని రామానంద్ నగర్లో ఓ ఉమ్మడి కుటుంబం జీవిస్తోంది. కుటుంబ పెద్ద సుభాష్ చంద్రబోస్(సాయిరాం), ఇందిరా దంపతులు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వీరికి కొవిడ్ సోకిందని తేలగా... స్థానికంగా చికిత్స అందించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారగా... కుటుంబీకులు వారిని విజయనగరం తరలించారు. అక్కడ ఇద్దరూ వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఒకేరోజు మృతిచెందారు.
విషాదం: వృద్ధ దంపతులను బలితీసుకున్న కరోనా - Vizianagaram District Latest News
విజయనగరం జిల్లా పార్వతీపురంలో విషాదం జరిగింది. కరోనా రక్కిసి వృద్ధ దంపతులను బలి తీసుకుంది. వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు ఒకేరోజు మృతిచెందడంతో... ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
వృద్ధ దంపతులను బలితీసుకున్న కరోనా