ఆంధ్రా ఒడిశా ప్రధాన రహదారి స్తంభించింది. రహదారి గోతుల్లో లారీలు దిగుబడ్డాయి. ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ వద్ద రహదారి గోతుల్లో రెండు లారీలు కూరుకుపోయాయి. విశాఖ నుంచి ఒడిశా రాష్ట్రం రాయగడ వెళ్లే ప్రధాన రహదారి కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
దిగబడ్డ లారీలు.. స్థంభించిన ట్రాఫిక్ - news on traffic jam at andhra odisa
ఆంధ్రా ఒడిశా ప్రధాన రహదారిలో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయ్యింది. రహదారి గోతుల్లో లారీలు దిగుబడడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
![దిగబడ్డ లారీలు.. స్థంభించిన ట్రాఫిక్ traffic jam at andhra odisa border](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8792881-639-8792881-1600064222160.jpg)
దిగబడ్డ లారీలు.. స్థంభించిన ట్రాఫిక్
ఈ రహదారి పూర్తిగా పాడైంది. తరచూ గుమ్మడ గ్రామ సమీపంలో వాహనాలు గోతులు కూరుకుపోతున్నాయి. ఈ మార్గాన్ని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: శ్రావణి కేసు: దేవరాజ్‌రెడ్డి పెళ్లి నిరాకరించినందుకే ఆత్మహత్య!