విజయనగరం జిల్లా పార్వతిపురంలో దలై వలస సమీపంలో ట్రాక్టర్ ఢీకొని యువకుడు గాయపడి మృతి చెందాడు. ఖానాపురం గ్రామానికి చెందిన యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. పెద్దగా దెబ్బలు కనిపించకపోవడంతో యువకుడు కొంతమంది సహాయంతో ఇంటికి వెళ్లిపోయాడు. కొద్ది సమయానికి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబీకులు గమనించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా కన్నుమూశాడు. అందివచ్చిన కొడుకు అర్ధాంతరంగా కన్నుమూయడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది గరుగుబిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్న గాయాలే అనుకున్నాడు.. మృత్యు ఒడికి చేరాడు - vizianagaram
ట్రాక్టర్ ఢీ ఢీకొట్టడంతో యువకుడు గాయపడి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది
చిన్న గాయాలే అనుకున్నాడు.. మృత్యు ఒడికి చేరాడు